ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము

కన్య : అప్పటివారల కివి కల్పిత శ్లోకములను జ్ఞానము గలుగక నడుమ ప్రబలమగు దురాచారముల మగ్నులై మాయాచారముల మానజాలమని కూరుచున్న చో నా కల్పాంతము మనతోడికాంత లెల్లరు మూర్ఖురాండ్రై యుండవలసినదే కదా !

మంజ : అటులెందుకగును ? ఆచారములన దేశకాలస్థితుల ననుసరించి పరమేశ్వర గుణకర్మాను కూలముగ బ్రజలందఱు నడుచుకొన వలసిన విధులేకదా ! ఒకవేళ మనదేశము నీవు వచించినట్టి స్థితికి వచ్చిన బుద్ధిమంతులగు కుచారసంస్కర్త లప్పటికెవరైన బయలుదేరకుందురా?

కన్య : అవునులెమ్ము. మనదేశమున కెట్టియిక్కటులు మూడవలసియున్నవో యెఱుగము. నా జనకుఁడు చక్రవర్తితో నింతవైరము బెట్టుకొనకున్న దేశమిట్టి గతికి వచ్చియుండదుగదా!

మంజ : అవును. మూర్ఖమతుల మనసు ద్రిప్పనెవరితరము?

కన్య : చెలీ ! ఇప్పుడీ సంగతులన్నియు ముచ్చటించుకొనుటవలన నా మనసు కలత నొందినది. మనగృహారామములోనికి బోయివత్తము. .

మంజ : ఒంటిగంట కావచ్చినది. ఇప్పుడేమి?

కన్య : అటుకాదు. త్వరలో మరలి చనుదెంతము రమ్ము. అన మంజరి తన చెలిమాట ద్రోయజాలమి నటులేయని సమ్మతించెను. అంతనా కన్నియ లిరువురు మందిరారామము లోనికేగ వెడలిరి.

49