ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సమాజమువారు. గొన్నిశ్లోకములఁ గల్పించి చెప్పుచున్నారట.

కన్య : ఆశ్లోకము లేవో నీకు దెలియునా ?

మంజ : నాకన్నియు దెలియవుగానీ రెండుమూడు మాత్రము నా నోటికివచ్చును. వచించెద వినుము.

స్త్రీలకు వేదాది విద్యల నేర్పకుండుటకు,

"స్త్రీ శూద్రౌనాధీ యామితిశృతేః " అనియు

వారలకు బాల్యమందే వివాహము లొనరించుటకుగాను,

"అష్టవర్షాభవే ద్గౌరీనవ వర్షాచరోహిణీ,
 దశవర్షా భవేత్కన్యా తతఊర్థ్వంరజస్వలా."

"మాతాచైవ పితాతస్య జ్యేష్ఠోభ్రాతాతథైవచ,
 త్రయస్తే నరకంయాంతి దృష్ట్వాకన్యాం రజస్వలాం."

అను నవి పారాశర్యము మొదలగు స్మృతులలోనివని చెప్పి యొప్పించు చున్నారట. ,

కన్య : అయ్యో ! ఈ పాడు శ్లోకములే ముందుకు బ్రామాణికములై యప్పటివారి కంఠములఁ బట్టుకొనునేమోకదా !

మంజ : మఱి కాలము ననుసరించి సంఘమందు మార్పులఁగావించుకొనకున్న నెట్లు? ఈ మ్లేచ్చుల శ్రౌర్యము లన్నియు నడిఁగి యుత్తములగు రాజులు ప్రాప్తించి దేశమంతయు నెమ్మదిగనున్న తరి మరల యథా ప్రకారము కావచ్చును.

48