ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము


వతియై బహిరంగముగ సంచరించుచుండు కామిని యే మహ్మదీయునకో యాహారమగుననుట తధ్యమే.

కన్య : కట్టా ! మనజాతి కాంతల కెట్టి యిక్కటులు సంభవించినదే? అవును. ఇట్టియెడ బూర్వాచారమని పట్టుపట్టిన నెట్లు?

మంజ : మా పూర్వాచారము వదలజాలమని కూరుచున్న వారు తమవారల మ్లేచ్ఛులకే యొప్పగించుచున్నారు.

కన్య : అయిన సంస్కార కర్తలిపుడేమి చేయుచున్నారు ?

మంజ : ప్రతిగ్రామమునకేగి యందు మీ మీ స్త్రీలరక్షించుకొనదలఁచితిరా బాల్యమందే వివాహములు సేయుడనియు, లేకున్న మ్లేచ్ఛులబారిఁ ద్రోయవలసివచ్చుననియు, నుపన్యాసము లిచ్చుచున్నారు. అందులకు గొందఱు, సమ్మతించుచున్నారట. కొందఱు "మా పిల్ల లెటులైన గానిండు. మా పెద్దలేర్పఱచిన యాచారముల వదలమని వచించుచున్నారట. మఱికొందఱు సంస్కార పక్షమవలంబించియు, లో లోపల దమ పూర్వాచారముల విడువకున్నారట. ఇంక గొందఱు మనఃపూర్వకముగ సంస్కారపక్షముగైకొన నభిలాష గలిగియుండియు దమ పెద్దలకు జడసి యూరుకొనుచున్నారట. ఇప్పు డందువలన దేశమంతయు నాలుగువిధములై యున్నది. మఱియు గొన్నిగ్రామములందలి ప్రజలు తమమాట వినక ధర్మశాస్త్రముల నేవైన ప్రమాణములఁ జూపుడనికోర సంస్కరణ

47