ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త

మంజ : 'ఉండెనట' యని యనుచున్నావా? ఇప్పుడు మరల వచింప నలవికాని యల్లరులు జరుగుచున్నవట. గడచిన శతాబ్దమందే మ్లేచ్చుల పోరు దప్పించుకొనుటకు గొందఱు సంఘసంస్కార కర్తలు గ్రామములమీద బయలుదేరి ప్రతియూర నాడుబిడ్డల కెనిమిదవయేడు రాకమునుపే వివాహము జేయవలయుననియు, బురుషుడు గతించిన స్త్రీని మగని శరీరముతోడనే దహనము సేయవలయుననియు, వారలకు విద్యసెప్పించి, బహిరంగముగ దిరుగనీయ గూడదనియు బోధించుచుండిరని నీవెఱిఁగియే యున్నావుకదా!

కన్య : అయ్యో ! మఱచియున్న యా దుర్దినములందలి సంగతులన్నియు జ్ఞాపకమునకు దెచ్చితివా? ఆ విషయముల గుఱించి వ్రాసియున్న గ్రంధములఁ జదువునపుడంతయు నాకు భరింపనలవికాని వేదన గలుగుచుండును. ఆ పాడు దినములు పోయినవనియే తలంచితి. అయిన మరల నిపుడెవరైన సంస్కారకర్తలు బయలు దేరినారా ?

మంజ : బయలుదేరకున్న నెట్లు? మనవారందఱు మాపెద్దలేర్పఱచిన పూర్వాచారముల మానంజాలమని తమబిడ్డలకు పదహారవయేఁటివరకు వివాహమొనరింపక యుంచినచో నీ లోపలనే యే మ్లేచ్చుడో తన వాత వేసుకొని పోపుచుండును ; పురుషవిహీనయగు కాంత బ్రతికియున్న నెప్పుడో యొకనాడు రాక్షసునిపాలు కావలసినదే. విద్యా

46