ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము


లగు మఱికొందఱు మఠాధిపతు లలవాటుపడి వామమార్గులను పేరున దేశమునందెల్లెడల బోధించుచు ననేక ప్రజలఁదమలో గలుపుకొని దురాచారముల గడఁగ నారంభించిరి. అప్పటికే నూరు వర్షములనుండి దేశమున నుత్తములగు రాజ్యపాలకులు లేనందున బాఠశాలలన్ని యు ధనలోభులగు నధికారులమూలమున నాశనమై యుండుటచే జనులును విద్యావిహీనులై యుండిరిగాన మూర్ణులై తమ పురోహితుల మాటలేవిని మోసపోవుచు వచ్చిరి. ఇటులుండ జక్రవర్తి సింహాసనమునకు వచ్చిన పిదప నత డుత్తమ విద్యావంతుడగుటచే దన రాజ్యమున జరుగుచున్న హత్యల కసహ్యముజెంది తనదేశమునందట్టి దుష్కార్యము లొనరింపగూడదని గట్టి యుత్తరువు గావించి సత్యవిద్యావిదూరు లగుటచే బ్రజలిట్టి యకార్యముల నొనర్ప గడఁగినారుగదా యని యోచించి ప్రతినగరమునందు బాఠశాల లేర్పఱచి మాసిపోయిన చదువుల మరల బైకిఁదెచ్చినాడు. అందువలన నుత్తమ విద్యావంతులై జనులు కొందఱట్టి దుర్మార్గములుచేయుట మానివేసిరి. మఱియు పదునొకండవ శతాబ్దమున గలిగిన మ్లేచ్చుల యార్భాటములచే జనులందఱు నొక క్రొత్తమార్గము ద్రొక్కుచున్నారు. తమతమ కాంతలు మ్లేచ్చుల వాతబడకుండ సంఘమందనేక మార్పులఁ గలిగించు కొనుచున్నారు. అవి నేటి వరకును జరుగుచునే యున్నవికదా ! -

కన్య : అవును. పాపము. మన బోడికాంతల మ్లేచ్చులు పెట్టిన బాధలు గణింప నలవికాకుండెనట.

45