ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


మంజ : నెచ్చెలీ ! ఈ నిమేషమునఁ జంద్రబింబము గాంచుటకంటె నీ వదనము జూచిన నెక్కువ సంతోషము కలుగుచున్నది కదా?

కన్య : ఎందువలన?

మంజ : మనోహర నామ ప్రశంశచే సంతోషము పొంగి మొగముపై వెలిబారుచుండుటవలన.

కన్య : చాలులెమ్ము నీ మాటలు. అయిన నా రాజుగుఱించి యింకేమైన నూత్న వృత్తాంతములున్నవా?

మంజ : వలచియున్న దానవు నీకుమాత్రము తెలియదా?

కన్య : ఆయన సుగుణగణములవిని వలచితినిగాని ప్రస్తుతమతఁ డొనరించుచున్న కార్యములఁ గూర్చి నా కేమియు బాగుగ దెలియదు.

మంజ : అటులైన నెలరోజుల క్రిందట మా పినతల్లిగారి గ్రామమున కేగినప్పుడటఁ "జక్రవర్తి" యను పేరుగల మాసపత్రిక నొక దానిఁగాంచితి. అందుగల విషయముల సారాంశము దెలిపెదను వినుము. ఋషిజనసేవ్యమానమై, పవిత్రవంతమై ప్రఖ్యాతికెక్కిన మన యార్యావర్తమునకు మాంసఖాదనులగు కొన్ని జాతులవారి మూలమున లేనిపోని బెడదలు సంభవించినవి. మొట్టమొదట బాంచాలమున బశ్చిమప్రాంతముల నుండు ప్రజలు కొంద ఱాఫ్‌గన్ దేశస్తులగు మ్లేచ్చులఁ గలసి సలలముదిన నలవాటుపడినారు. వారివలన స్వార్థపరు

44