ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము:


నుతులందు చుండునో, యెవని పరాక్రమ శౌర్యములు వైరిరాజులకు గుండెదిగులు జుట్టించు చుండునో, యెవని రూపురేఖా విలాసములు సౌందర్యవతులని ప్రఖ్యాతి వహించిన కస్యకామణుల స్తోత్రము లందుచుండునో, యెవనినామ మెన్ని పర్యాయములు విన్నను నీకు దృప్తియుండదో .......

కన్య : అబ్బ ! పేరుచెప్పుచున్న నీ ప్రసంగమంతయు నేటికి?

మంజ : ఇంతచెప్పి పేరుచెప్పక మానుదునా? ఏమి, ఇంతలో నడ్డము తగిలితివి ; కానిమ్ము. సూర్యగ్రహమునకు తొమ్మిటి కోట్ల, పదునాల్గులక్షల, ముప్పదివేలమైళ్ళ దూరముననుండు గ్రహమేది?

కన్య : భూమి.

మంజ : దానికొక చక్రవర్తివలన గలిగిన పేరేమి ?

కన్య : పృథివి.

మంజ : మనదేశమందలి కవులు నృపాలునకుఁ జంద్రునకుఁగలిసి వచ్చునట్లు శ్లేషాలంకారమున వాడు పదమేది ? కన్య : కువలయపతి. మంజ : ఏకపదము జెప్పుము. కన్య : రాజు, మంజ : ఆ రెండిటిఁ గలిపిచెప్పుము. ఆతడే.

అన బట్టరాని సంతసమున మోము కలకలలాడుచుండ నేమియుఁ బలుకక వాల్జూపుల మంజరిఁ జూచుచు నా కన్నియ యూరకుండెను. అప్పుడు మంజరి యిట్లు పలుకరించెను.


43