ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త

కన్య : అవును. చెలీ ! ఈపండువెన్నెలలో నా కెంతసంచరించినను విసువు జనింపకున్నది. ఆహా ! ఎల్లఁగడల నిశ్శబ్దముగనుండ నాకసమునందెచ్చటను మబ్బులేక నక్షత్రము లలరారుచుండ సంపూర్ణకాంతుల రాజిల్లు నీ చంద్రమండలము చూపరుల కెంత యాహ్లాదములు గొల్పుచున్న దే.

మంజ : అవును. దేశమందేకల్లోలములు లేక ప్రజలందఱు హాయిగసుఖింప ధీరపరాక్రమవంతుడై తేజశ్శాలియై కువలయ పాలనమొనరించు రాజుగాంచిన నెవరికానందము గలుగకుండును ?

కన్య : ఈ కాలమున నట్టివారిలేరైన గలరా?

మంజ :లేకేమి?

కన్య : చెలీ : అట్టి మహాత్ముని నామాక్షరముచే నా శ్రవః పుటముల నలంకరించెదవా?

మంజ : ఆహా ! ఎంత తెలియనిదానివలె నటించదవే, నా నోటజెప్పింపవలెననియా?

కన్య : అటుకాదు. నీ యుద్దేశమేమో చెప్పుము.

మంజ : మనయిద్దఱి యుద్దేశముల కెప్పుడు భేదముకలుగ లేదుకదా?

కన్య : లేదుగాని యిపుడు నీవువచింపరాదా !

మంజ : కానిమ్ము. నీ వాంఛిత మేల నష్టపరుపవలయును ? చెప్పుటకు నాకును వినుటకు నీకును విసుగు కలుగదులే. ఏ రాజు సద్గుణపుంజముల కాటపట్టని సమస్త ప్రజలచే

42