ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము


తెల్లవారినదను భ్రమను రెక్కలవిదుర్చుకొనుచు గూండ్లవదలి బయటికేతెంచి యిటునటు గొంతదూరమేగి మరలివచ్చి తమ తమ నెలవుల జేరుచుండెను. అట్లు సకలలోకాహ్లాదకరమై పిండియారబోసినట్లు కాయుచున్న పండువెన్నెలలో గన్యాకుబ్జ రాజ్యమునం దనుపమానమని ప్రఖ్యాతికెక్కిన నొకశశికాంత శీలావినిర్మిత సౌధోపరితలంబున బాలికయొకర్తు తనప్రియవయస్యలంగూడి వెన్నెలవిహార మొనరింపుచుండెను. ఆ కన్నియ నూతనముగ బ్రాప్తించిన నిండుజవ్వనముచే రూపొందిన సౌందర్యరాశియో యన రాజిల్లుచుండెను. స్నిగ్ధమై బంగారు చాయలంగేరుకాంతిగల పచ్చనిశరీరమును, గుండ్రనిమొగమును వాలికలగు గనుదమ్ములుంగలిగి నాటిదినమున నా కన్యక చెవులఁ దాల్చిన రవలకమ్మల వెలుగులు పలుచని చెక్కుటద్దముల బ్రతిఫలింప గ్రొమ్ముడి సడలి యవటుతలంబునబడి నర్తన మొనరింపుచుండ, హసన్ముఖియైన నవమోహినీ దేవతయోయన సంచరించుచుండెను. అర్దరాత్రము కా వచ్చువరకు నట్లే విహరింపుచుండి పిదప గొంతవడికి మంజరి యను ప్రాణసఖిందక్క. దక్కినవారల వారివారి నెలవులకనిచి నెయ్యంపుసఖిం జేరబిలిచి యిట్లనియె.

కన్యక : సఖీ ! ఇపుడెంతకాలమైయుండును.

మంజ : కొంచె మించుమించుగ నర్ధరాత్రము కా వచ్చినది. ఇంకను బండ్రెండు గంటల ఫిరంగి వినబడలేదుగదా !

41