ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త

మొదటి ప్రకరణము

మారమి యెనిమిదివందల సంవత్సరముల క్రిందట ఢిల్లీ పట్టణమునకును గన్యాకుబ్జనగరమునకును నడుమనున్న యమునా గంగా ప్రాంత కాంతార ప్రదేశంబు లొకనాటి సాయంకాలమునఁ జూపరుల కపరిమితానందభయ దాయకములగు రంగస్థలములై యుండెను. మూర్ఖమతులగునో ఆర్యావర్తవాసులారా ! మదోన్మత్తులై, సత్యవిద్యావిదూరులై, కుమతాచారములం బట్టువడి, యైకమత్యాభావమున మెలంగుచు, మాతృభూమియగు నార్యావర్తముపై నించుకైన నభిమానముంచక, పరస్పర ద్వేషంబుల జనింపఁజేసికొని దుష్కృత్యములఁ గావింప సమకట్టితిరి కాపున నందఱకు బుద్ధివచ్చునటుల మీపై దాడివెడలఁ బరరాజునొకని బ్రోత్సాహపఱచెదనని కోపారుణితలోచనుండై యవనదేశమున కేగుచున్నాడోయన రవి పడమటి సమద్రమునఁ గ్రుంకు

5