ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము

కలకళా పరిపూర్ణుండై హిమాంశుండు తన శ్వేతకాంతులచే గన్యాకుబ్జనగర సౌధములకు వెండినీరు బోయుచు బ్రకాశింపు చుండెను. పరస్పర సంఘట్టనంబులలేచు యమునాతరంగతుషార సముదయములందడిసి, నెత్తమ్ముల పుప్పొళ్లంజిందులాడి, నవమల్లికా ప్రసవ సౌరణముల గొల్లగొని, కేతకీగర్భ పరిమళముల హరించి, పొగడతావులంగలసి మందహాసంబున శీతలమలయ మారుతుఁడు పాంథజనముల పరితాపం బపనయించుటకోయన బురంబునెల్లెడల సంచరించుచుండెను. రాత్రి పదునొకండు గంటలగుటచే మనుష్యసంచార మెచ్చటను లేకపోవుటయేకాక పక్షుల కలకలంబులును గడఁగి యూరంతయు మాటుమణగి యుండెను. కొన్ని గొప్పగొప్పవృక్షములపై నిదురించియున్న పక్షులుమాత్రము మేల్కనినపుడంతయు జంద్రాతపమునుంగాంచి

40