ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము


త్వరితగమనంబున సొరంగమార్గముగుండ బయటికేతెంచి జాగరూకుఁడై లోపలినుండి వచ్చువారల కగుపడకుండునట్లు గుహా ముఖమున దాగియుండెను. లోపలి యిరువురు దమయజమానికి సలాములొనరించి గుహామార్గమున బయటికేతేర నొకని తరువాత నొకరు వచ్చుచుండిరి. మొదటివానితల బయటి కగుపడిన నిముసమున దాగియున్న పాంథుడు తన ఖడ్గముతో దాని నెగుర గొట్టెను. రెండవవాడు దిగ్భ్రమజెంది వరలోనున్న తనకత్తిని

బైకి దీనుకొన బోవునంతతో వానిపై కురికి పట్టుకొని క్రింద బడదన్ని రొమ్ము పై కాలువైచి " దుష్టులారా ! మీ కక్కడ మరణము తప్పినను నిక్కడ దప్పుననుకొంటిరా? అధర్మాలోచన వరులగు వారి దైవమెక్కడనైన శిక్షింపకమానడు." అనుచు వానిఁగూడ మొదటివానికి దోడుగబంపి యా రెండు కళేబరము లచటనే పడియున్న నా దారివచ్చి పోవువారికి సంశయము కలుగునని చేరువనున్న యమునం బారవైచి తన శరీరము శుభ్రపఱచుకొని తాను గావించిన సాహసకృత్యమునకుఁ బరవశుండగుచు నాలుగు గంటలు మీరినందున బురము దారిఁబట్టి పోయెను,

39