ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త

భట్టు : చక్రవర్తికే. తన్నెటులైనఁ బెండ్లి యాడుమనియు లేకున్నఁ బ్రాణములఁ ద్యజించెద ననియు వ్రాసి యున్నది.

యజ : ప్రాణముల వదలునంతటి మోహము గలిగియున్నదా ఆ కన్నియకు?

భట్టు : నందేహమేమి ?

యజ : మరి చక్రవర్తి కామెపై నింత ప్రేమమున్నదా ?

భట్టు : ఆహా ! ఇంతకన్న నెక్కువే :

యజ : నిక్కము వచింపుము.

భట్టు : నిశ్చయమే చెప్పుచున్నాను. చక్రవర్తికామెపై నింతకన్న నెక్కువ మక్కువగలదు.

యజ : అటుపైన జక్రవర్తి యింతకాల ముపేక్ష చేసియుండుట కేమికారణము?

భట్టు : జయచంద్రునకుఁ దనకుఁగల వైరమువలన చక్రవర్తి కొంచెము వెనుదీయుచున్నాడు. కాని యెప్పుడో యొకసారి పెండ్లియాడక మానడు.

యజ : ,అయిన మనమిప్పుడు చక్రవర్తిని సులభముగనే తుదముట్టింప వచ్చునే ?'

భట్టు : ఎట్లు?

యజ : ఏకరణినైన మనమా సంయుక్తను జంపించవలయును. అందువలనఁ జక్రవర్తి నశించును. పిదప మనము

36