ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము


భటులు ప్రక్కలనొదిగి నిలిచియుండిరి. సోఫామీఁద యతఁడు కొంచెమించుమించుగ నేబదివర్షములు సూచియుండును. జిల్తారు మయమైన పాగను ధరించి బంగారుచెమ్కీ పనిచేసిన షేర్ వాణీని దాల్చి రేష్మీపాలుజామా దొడిగి పాదములకు మేజోళ్లబూని యుండెను. మఱియు దూరముగనున్న హుక్కాగొట్టముద్వారా మాటిమాటికి బొగబీల్చి ముక్కులవెంట నోటివెంట వదలుచు దన కట్టెదుటనున్న నలువురు మనుష్యులపై గోపదృష్టిపఱపి గద్దించి పలుకుచుండెను. భటులు నల్గురు నల్లనిలాగులఁ దొడుగుకొని యెఱ్ఱబనారస్ చొక్కాలఁ దాల్చి పసుపురంగు పాగల నెత్తి ధరించి నడుమున కాకుపచ్చరంగుగల కాశలఁ జుట్టుకొని నయ భక్తుల నా పెద్దమనుష్యునితో దమ సమాచారముల విన్నవింపుచుండిరి. సోఫాపై గూరుచున్న మనుజుడు వీరల దిక్కరించి మాటలాడుచుండుటఁబట్టి యతండే ప్రభువని యా బాటసారి గ్రహించి పొంచియుండి వారిమాటల నాలింపసాగెను. అప్పుడా దొర భటులపై గోపదృష్టిబఱపుచు “ ఛీ ! దుర్మార్గులారా ! మిమ్ము నింతింత కండలుగగోసి కాకులకు వైచినను బాపము లేదు : మీకింత స్వతంత్రమా ? బుద్దిహీనులారా ! మీకున్న యాలోచన సుల్తానుగారికి లేకుండెను గాబోలు. పరుఁడగుపడిన తక్షణమే చంపక యెంతశ్రద్ధతో గాపాడుచున్నను నెట్లోగికురించి తప్పించుకొనిపోయి మన రహస్యముల వెల్లడిసేయునవికదా గోరీగా రగుపడిన వాని నగుపడినప్పుడే చంపవలసినదిగ నాజ్ఞాపించినారు. " అని పల్కెను. అందులకానల్గురు చేతులజోడించు

33