ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

ట్లా బాటసారి గుహఁ బ్రవేశించి యెంతదూరము నడచినదియు నెఱుగజాలముగాని గడియ యగునప్పటి కవతలమెట్లు కాలుఁ దగిలెను. వాటిమీదుగ నెక్కివచ్చి యొక యుద్యానవన మధ్యమున దేలెను. అట నేమిజేయుటకును దోచక నలుదిక్కులు పారజూచుచు నిలువబడియుండ జెట్లసందులనుండి దివ్యభవనమొండు దృగోచరమయ్యెను. కనుపడిన యా సౌధము దగ్గరకు బోవదలచి చెట్లమాటున డాగుకొనుచు నిశ్శబ్దముగ గొంతదూర మేగ వాక్యములు వినవచ్చెను. మాటల సవ్వడిఁబట్టి మఱింత దగ్గరకేగ నట నొక మందిర ప్రాంగణమున దీర్ఘకాయుడును, నెఱ్ఱమామిడిపండు బోలిన మొగముంగలవాడును నగు మనుజు డొకండు సందేశముం గొనివచ్చిన నలుగురు భటులతో సంభాషించుచుండెను. ఆ మనుజుడు సోఫాపై గూరుచుండియుండెను.

32