ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము


చిత్రము? మానవులు తఱచుగ సంచరింపని యీ రహస్యంపుఁ జోట నిట్టి సొరంగ ముండుట కేమికారణము. అడవిజంతువుల యా వాసమనుకొందునా ! అటులెన్నటికిఁ గాజాలదు. రహస్యా లోచనము లొనరించుకొన వచ్చిపోవువారి కేవిధమైన యాటంకములుఁ గలుగకుండునట్లు చమత్కారముగ నిర్మింపబడి యున్నది. విచారింపనిది రాజశాసనంబులకు వెఱచి దమ దుష్కార్యముల బహిరంగముగ సలుపుకొనవలను లేక రహస్యముగ గావించుకొనుటకై కట్టుకొన్న తుచ్చులగు వామమార్గుల కృత్యమైనఁ గావలయును. కానియెడల చక్రవర్తిని రాజ్య భ్రష్టునిజేయఁ గుట్రలఁ బన్నుచున్న యే యధికారుని కృత్రిమమైనఁ గావలయును. ఎటులైన దీని నిజము గనుగొనకతప్పదు. చీ ! బయలుదేరినవాడ నట్లేపోవక వెనుకకేల మరలితి. చేత నొకచిన్న కత్తియైన లేవిసమయమున దప్ప గృహమువెడలిన దాది నిట్టి పిరికితన మెప్పుడుఁ బూననైతిఁగదా. కానిమ్ము, మరల బ్రవేశించి దీనినిక్కమరసి వచ్చెదను. అవి దృఢ విశ్చయుడై పరుల కగుపడకుండ లోనఁబెట్టుకొనియున్న ఖడ్గమును జేతధరించి పరమేశ్వరునిపై భారమువైచి దానిగుండ నడచిపోవ నారంభించెను,

31