ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


గ్రిందనొక చోటబెట్టి యుస్సుమని నిట్టూర్పుల విడచుచుఁ దొడుగుకొనిన చొక్కాయంతయు దడిసి వీపునకంటుకొనిపోవఁ బట్టిన చెమట చీదరవలన దానిఁదీసి యెదుటనున్న చిన్న చెట్ల కొమ్మలకు దగిలించి చెమట నార్చుకొనుచు బచారుసేయు చుండెను. అట్టి సమయమున నక్కడకుఁ బిలుపుమేర దూరములోనున్న యొక చిన్న గుట్ట యడుగుభాగమున మనుష్యులు మాటలాడుచున్నట్లు వినరానంత వరకు నా నిర్జన ప్రదేశమందు దానుతప్ప యితరులెవ్వరు లేరని తలఁచుచుండిన యా బాటసారి మనుష్యుల యలికిడి విన్నతోడనే శీఘ్రముగ దన వేషమును ధరించుకొని మెల్లన నా దిప్పను జుట్టిపోవ మొదలిడెను. నలు దిక్కుల నతిశ్రద్ధమై తిలకింపుచు నడచి యవతలికేగిచూడ నట నొక మానవుడైనను గన్పింపకపోయెను. అందుల కాశ్చర్య మందుచు గుట్టపైకిబోయి నాల్గుమూలల బరికించియు గార్యముఁ గానక మరల నాశబ్దమేతెంచిన స్థలమునకు వచ్చి ప్రతిపొదయందును బరిశీలింపగా దట్టముగ దీగెలచే నల్లుకొనియున్న యొక లతాగృహమునఁ దలుపొకటి క్రింద బరుండఁబెట్టి యుండుటగాంచి దానిఁపరీక్షింప లోనికేగి తలుపుఁబై కెత్త నెక్కి దిగుట కనుకూలముగ నుండునట్లు త్రవ్వఁబడిన మెట్లఁగూడు కొనియున్న గుహకనుపించెను. దానిఁజూచినతోడనే విస్మయం కలిగి మెట్లదిగి కొంచెము దూరముపోవ గుహవిశాలమై కనుపడెను. ఆత్తరిమనస్సున కించుక భయముదోప మరలి గుహాద్వారముకడకు వచ్చి యిట్లాలోచింపగడగెను. ఆహా! ఇదియేమి

30