ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము


వచ్చు. యమునతో గలసి కొంతదూరమువరకు నదీతీరముననే పోవుచుండును. ఈత్రోవ ప్రయాణీకులు పథశ్రమం బార్చుకొనుటకై పెంచఁబడిన వృక్షములచే గాక, పురమువెలుపట యడవిలో వేయబడియుండుట వలన, నానావిధ వృక్షలతా గుల్మములచేఁ బరీవృతమైయుండెను. అట్టి యా చిన్న యడవి మార్గముగుండ నొకనాఁటి మిట్టమధ్యాహ్న కాలమందు మనుజుడొకడు కాషాయపు రంగుగల పొడుగుపాటి యంగరఖాను ధరించి, యట్టివర్ణమేగల పాగ నొకదానిఁ దలకుఁజుట్టుకొని కమండలుపు మొదలగు వస్తువులు గలిగిన యడపమొకటి భుజముపై వ్రేలాడుచుండఁ జేతిలోని దండమును ద్రిప్పుకొనుచు దీర్ఘాలోచనపరుండై వచ్చుచుండెను. ఇతనికి సుమారు నలువది వత్సరములుండును, ముప్పదియేండ్లు వచ్చునప్పటికే ముసలితనము వహించి మూలగూరుచుండ నలవాటుగల దుర్బలులగు కొందఱిఁబలెఁ గాక యా మనుజుడు మంచి పిక్కబలిమి గలిగి యుండెను. అతని మొగముఁజూడ ననేకకష్టముల ననుభవించి వానినుండి తప్పించుకొని వచ్చినట్లును, నొక కార్యభారమును దలధరించి యహోరాత్రములు దత్సాధనము నిమిత్తము పాటు బడుచున్నటులును దోపకమానదు. మిటమిటలాడు మండు వేసవికాలమందు దీర్ఘప్రయాణము సేయుచువచ్చిన యా పాంథుడు చల్లని నీడలచే బ్రాణములేచివచ్చు నటులున్న యా యడవి మార్గమున నొక పెద్దవృక్షపునీడఁ గొంత తడపు విశ్రమింపదలచి చేతియందలి దండమును, భుజముమీది సంచిని

29