ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము

నేక సంవత్సరములకు పూర్వ మార్యచక్రవర్తియగు యుధిష్ఠిరుని కాలమున నిర్మింపబడి యింద్రప్రస్థమను ప్రసిద్ధనామంబున బ్రఖ్యాతిగాంచి యేడెనిమిదివందల సంవత్సరముల క్రిందటివరకు నా యార్యచక్రవర్తుల స్వాధీనమందేయుండి తదనంతరము

మ్లేచ్చ సుల్తానుల పాలఁబడిన డిల్లీనగరమగూర్చి మీరందఱు వినియేయుందురు. మహోన్నతములగు సౌదప్రాకార సంచయములచేతను, నతివిశాల మనోహరములగు నుద్యానవన వాటికల చేతను, వినుతికెక్కి క్రీస్తుశకము పదునెనిమిదవ శతాబ్దాంతము వరకు జక్రవర్తులకే వాసభూమియగుచు వచ్చిన ఢిల్లీనిగూర్చి వేరుగ వచింపనేల? ఈ నగరముయొక్క దక్షిణదిశనుండి మధురాపురమునకొక గొప్ప రాదారిబాట నిర్మింపబడియున్నది. ఈ దారి పట్టణము వెలుపట మూడు మైళ్లదూరమున ఢిల్లీని జుట్టుకొని

28