ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము


యిష్టానుసారమటులే సమర్పించెద " మని ఒప్పుకొని సాష్టాంగ నమస్కారము లాచరించిరి. కొంతసేపైన తరువాత నా శివమెత్తిన వానికిఁ గుత్తుకబంటిగ గల్లుబోసి యొకచోఁ బరుండబెట్టి తామును ద్రావసాగిరి, కొందఱు బాటసారికడ కేతెంచి కట్లువిప్పి “నేఁడు నీవు మా దేవీ ప్రసాదమువలన బ్రతికిపోతివి. పొమ్మని బయటికిగెంట నతఁడును బులినోటజిక్కి చావక బయటబడిన మేకవలె లోలోన సంతసించుచు బురిదారిబట్టి పోయెను. ఇట గుడియందలి దుష్టులెల్లరు దెల్లవారునప్పటికి తమగార్యముల నన్నింటి నెరవేర్చుకొని దేవీవాంఛితమునకు నే రాజకన్యక తగి యుండునాయని యాలోచించుకొనుచు దమదారింబోయిరి.

27