ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


వరకు జరిగిన సంగతులన్నియు జూచుచు వామమార్గులం గలసి మూల గూరుచుండియున్న పురుషుఁడొకడు తన కార్యము నెరవేర్చుకొన మంచిసమయము దొరకెగదాయని యున్నటులుండి యూగులాడ సాగెను. చెంతనున్న కొందఱేమట్లూగెదవని యడుగ మారుపల్కక మఱింత తలద్రిప్పుచు నాపాదమస్తకము గడగడ వడకింపుచు బండ్లు పటపట గొఱుకుచు కన్ను లెఱ్ఱఁజేసి చూడ మొదలు పెట్టెను. దానిఁగాంచి యందఱు వానిచుట్టుఁజేరి దేహము స్పృశించి యేమనియడుగ వారిఁజావమోదుచు "ఆరే! దుర్మార్గులార ! మీరు నన్నెఱుగరా?” యని గద్దించిపల్కెను. అంతనెల్లరు గాళికాదేవి పూనినదని నిశ్చయించి సాంబ్రాణి గుగ్గిలపు ధూపములు వేయుచు వానిపాదములపైబడి మ్రొక్కి " అమ్మా ! దేవీ ! శాంతింపుము. మావల్ల యే మపరాధమువచ్చినదో చెప్పుమ" నిబద్దాంజలులై ప్రార్ధింప నా ధూర్తుండు “ ఛీ ! మూర్ఖులారా మీకావంతైన జ్ఞానములేదు. నీచజాతి సంభవుడగు మానవునొకని నాకుబలినొసంగదలచి యున్నారు. మిమ్మందఱి భక్షించెదను. చూడుడ" ని భయంకరమగ హుంకరించుచు బలికిన" అమ్మా ! భగవతీ ! శాంతింపుము ; ఎఱుకలేనితనమున నిట్టికార్యము సేయఁబూనుకొంటిమి. క్షమించి నీ యభీష్టమేమో తెలిపిన నెరవేర్చేదమ" నిరి, అంతనా పురుషుండు "బుద్దిహీనులారా ! నాకు సకల కళావతియు, సౌందర్యవతియునగు రాకొమారికఁదెచ్చి సమర్పించితిరా సరి. లేకున్న మిమ్మందఱ నాశనము గావించెదనని పల్కెను. దానికెల్లరు సమ్మతించి " తల్లీ ! నీ

26