ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


ప్రక్కకు దిగెను. అక్కడ గొందఱు పుణ్యాంగనలు "హా ! జయచంద్రా ! మావంటి మానవతులకెల్ల భరింపశక్యముగాని యవాచికములగు నిక్కట్టులఁ గలుగఁజేసి పోయితివిగదా" యని రోదనములు చేయుచుఁ గాష్టముల బేర్చుకొని వానికి నిప్పంటించుకొని పైఁబరుండి చచ్చుచుండిరి. జయచంద్రుఁ డా దారుణకృత్యముల నవలోకించి విభిన్న చేతస్కుఁడై " ఓ సాధ్వీమతల్లులారా ! పూజనీయంబగు పరలోకంబున కేగుచు బాపాత్ముఁడగు జయచంద్రుని పేరేల యుచ్చరించెదరు ? అయ్యయ్యో ! మీకిట్టిపాటు గల్గజేసిన యా దుర్మార్గుడుగూడ జావఁబోవుచున్నాడు. మీ కందఱకు స్వస్థత చేకూరుగాక " యని ఖడ్గముతోఁ బొడుచుకొని తన మిత్రుల దలఁచుకొనుచు బ్రాణములవదలెను. అంత నట స్నానము లొనరింప బోయిన వారు తిరిగివచ్చి పర్ణశాలయందు రాజులేకుండుటచే ననుమాస గ్రస్తులై యతని వెదకుటకు మువ్వురు మూఁడు త్రోవలఁ బోయిరి. అందు దేవశర్మ రాజుపడియున్న వైపునకేగి తగుల బడుచున్న కాష్టముల గాంచి విస్మితుఁడై కొంచె మవతలికి బోయి చేతిఖడ్గము కంఠమున గ్రుచ్చుకొనియుండ విగతజీవుడై పడియున్న యతని గాంచి హా ! యని మతిదప్పిపోయినవాడై కళేబరము మీఁదఁబడి " సౌర్వభౌమా ! హా ! జయచంద్రా ! మమ్మందఱ మోసము గావించి పోయితివా ! ఓ! ఆర్యా వర్తమా ! నీకుఁ బ్రేమాస్పదులగు రాజులెల్లరు నశించిరిగదా ! ఇక నీ గతియేమగు " నని విలపించుచు నా ఖడ్గము లాగుకొని

239