ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

ఇత్యాది జారగ్రామణులుసు. స్వార్ధపరాయణులును, సత్య విద్యావిహీనులునగు దుష్టులు రచించిన తంత్ర గ్రంధములలోని మంత్రములఁబఠించుచు శాంభవీ, భైరవీ, కాళి, చాముండా ! యను నామంబులనుచ్చరించుచుఁ బూజసేయుచుండిరి. అంతవరకును మూర్ఛఁదేరి యా క్రూరకర్మలఁ జూచుచున్న పాంథుఁడు తన మనమున నిట్లు తలపోయ గడఁగెను.

"అయ్యో ! ఇల్లు వెడలినదాది నా కన్నియు నష్టములే ప్రాప్తించుచున్న విగదా ! నేటితో నిక్కడ నా చావునిశ్చయము. నాగతి యెట్లయిన గానిమ్ము. నా కొఱకై దినములు లెక్క పెట్టుకొనుచు నిరీక్షించుచుండు నా కన్యగతి యేమికాఁగలదు. ఆహా ! ఈ దుర్మార్గుల హృదయములం దావంతైనఁ గరుణయనునది లేదుకాబోలు? వీరలనెట్టి పాపకర్ములనఁదగును. ఇట్టిస్వార్థపరులగు కుమార్గగాములు ప్రబలియుండ నిఁక నార్యావర్తము బాగుపడుటెట్లు ? కట్టా ! దుర్మార్గులారా ! మీకీవిధియంతయు నెవరు బోధించిరి. పాషండులారా ! మద్యమాంసములనా మీరు పూజించునది ? హా ! నేనేమి సేయుదు : ఓ రాజపుత్రీ! నీ కోరిక నెరవేర్పజాలనై తినని నన్ను నిందించెదవుసుమీ ? విధివశంబున బెట్టిదములగు చిక్కులంబడతిగాని నా యజాగరూకతవలన గాదు. పరమేశ్వరా ! నీ కించుకైన సజ్జనులగు వారిపై దయగలుగదా ! అని కడువిలపించి తన కట్టెదుట జరుగుచున్న యసహ్యపు జనులగాంచి కనులు భైరవులుగ్రమ్మ మరల గ్రిందబడిపోయెను. అంతవానికి మరల గొందరుపచారములు సలుపసాగిరి. ఇంత

25