ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త .


నిలువ నీడలేక చేసి యడవులపాలు కావించితివా? ఇక నేను జీవించి యేమి ప్రయోజనము? రాజ్యమా పోయె. బంధువులా నశించిరి. ప్రియతనూజయా మరణించె. నాకు గష్టములు కల్గిన యెడఁ దోడ్పడి రక్షింపగలవాడని తలఁపక నిష్కారణముగ నతిధీమంతుఁడగు జామాతతో వైరము బెట్టుకొంటి. తుద కతడును నాశనమయ్యె. హా! ప్రియకుమారీ ! సంయుక్తా ! నీ వచనంబు లెంతయాదరణీయములే ! అమ్మా ! తండ్రినని దయదలంపక నన్నప్పుడే చంపియుండిన నింతకానేరదుగదా ! సుగుణగణసమేతవగు నిన్నుఁ దిరస్కారము గావించి యింత దెచ్చుకొంటి. తల్లీ ! అప్పటికి నీ వచనసుధాధారలు విషతుల్యములై యా క్రూరుని విషవాక్యములే యమృతోప మానములయ్యె. అయ్యో ! నీ వెంతపరితపించి యుంటివోగదా? నేను నిన్నంత నీచముగ నొవ్వనాడినను నాపైఁ గిన్కఁబూనక నీ మరణకాలంబున నాతోఁ జెప్పఁబంపిన వాక్యము లెంత శ్లాఘాపాత్రములు! అమ్మా ! నీ వన్నట్లు నాకు గహన సంవాసమే ప్రాప్తమైనది. హా ! జామాతా ! చక్రవర్తీ ! నీవు నన్ను కన్యాకుబ్జనగరపు ముట్టడియప్పుడే యేలజంపవైతివి? అయ్యో : తలచుకొన్న కొలది నా కడుపు తఱుగుకొని పోవుచున్నది. చీ ! జయచంద్రహతకా ! మాతృదేశ ఘాతకుడవగు నీ వింకను బ్రతికి యుండ నెంచెదవా ? పోయి యిప్పుడే యెక్కడనైన మృతినొందరాదా యని తన్నుదాన దూషించుకొనుచు మిక్కుటమైన శోకమునఁ దన ఖడ్గముగైకొని కొండ యావలి

238