ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పది యొకటవ ప్రకరణము


లొక్కచోటఁ గూడియుండు నప్పుడు వేర్వేరు పనులమీద బలు ప్రదేశములకు బోవలసివచ్చును. మన మెంతరహస్య ప్రదేశమున వాసము చేయుచున్నను గ్రహచారముచాలక మనలో నొక్కడు శాత్రవులకంటబడుట సంభవించెనేని వారెన్నికష్టముల నైనఁబడి గుట్టుకనిపెట్టి మనలనందఱ వధింతురు. కావున మేమునల్వుర మెక్కడికైనబోయెదము. మీరు మఱియొక త్రోవనుబొండన " సమ్మతించి జయచంద్రుడు మొదలగువారలకు నమస్కృతు లొనరించి పౌరులు తమదారింబోయిరి. అనంతరము వారనల్వురక్కడకు గొంత దూరమందున్న నొకకొండదరికేగి యచ్చోట నొకరహస్యమగు ప్రదేశమున బర్ణశాలను నిర్మించుకొని యందు నివాసము సేయదొడఁగిరి. అనుదినమును జయచంద్రుడు పడుపరితాపమువకు బరిమితి లేకుండెను. దేవశర్మాదుల కతని నోదార్చుట దుర్ఘటముగ దోచుచుండెను. ఇటులుండ నొకనాడు మంత్రి పురోహితభృత్యులు మువ్వురు బ్రభాతకాలమున లేచి వాడుకప్రకారము నిత్యకృత్యముల నేరవేర్చుకొనుటకు గొండదిగువనున్న సెలయేటివద్దకు వెళ్లిరి. అంత గొంతసేపునకు జయచంద్రుడు మేల్కాంచి యొంటరిగనున్నందున దలంపులన్నియు మనస్సునకురా ! హా ! నే నెంత క్రూరకర్మఁడను ? నాకా యీశ్వరభట్టెక్కడ దాపరించె ? అయ్యో ! నిక్కమైనమిత్రుడని నమ్మితికాని నా కింతద్రోహము గావించువాడని కలనైనఁ దలచితినా ? సర్పమునకు బాలుపోసిపెంచునట్లు వానిఁబోషించితి. దైవమా ! నా ప్రజలకందఱకు

237