ఈ పుట ఆమోదించబడ్డది

రాణిసంయుక్త


మేశ్వరు బ్రార్ధించుచు నొక వేళ నీ కేమైన నపాయము గలిగిన దోడ్పడ నీ వెనువెంటనే మెలంగుచున్నారు. వారే యీవేషము" లని తమ మ్లేచ్ఛ దుస్తులఁ దీసివైచి వినయశీల దేవశర్మ కంచుకులై యెదుట నిలచిరి. అత్తరి జయచంద్రునకు గల్గిన సంభ్రమము వచింప నలవికాదు. మిక్కుటంబుగ విచారమును సంతోషము నుప్పతిల్ల నోట మాటరాక యొక్కక్షణకాలము వారి వంకనే దృష్టి నిగుడించుచు గూరుచుండియుండ వెంటనే లేచి వారి పదములపై వ్రాలెను. ఆ సమయమున వారనురాగ పూరితులై యతని లేవనెత్తి "రాజా ! ధృత్యుందగు మా పాదములపై బడుట నీ కుచితము కాదు, నీవు మరల సన్మార్గమున బడినందులకు మాకు మితిలేని సంతసము గలుగుచున్నది. గతించిన దానికి వగచిన నేమి ప్రయోజనము, పోయినరాజ్యము మనకు మరల రానేరదు. దుర్మార్గుడగు నీశ్వరభట్టు మనల కిట్టి గతి గలుగ జేసినాడు కాని " మ్మని పౌరులవంకకు దిరిగి " అయ్యా ! మీ రిప్పు డెక్కడికేగ బయనమైతి " రని యడుగ “ ధీమంతులారా ! మే మీ యరణ్యములందే వసింప వచ్చినాము ఏ పురము జేరబోయినను మహమ్మదీయుల పోరేగదా ! అట్లు కాని యెడల మీ రెట్లు చెప్పిన నట్లు నడచుకొసగల వార " మని పౌరులు వచించిరి. అత్తరి వారితో దేవశర్మ " పౌరులారా ! మన మందఱము నడపులయందే వసింప వలసినవార మైనను వేరువేరు కానలందు బ్రత్యేకముగ నుండదగిన వారమే కాని యొకటిగఁ గలసియుండుటకు మాత్రము వలనుపడదు. అనేకు .

236