ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


రాజును దుఃఖమున శిరము వంచుకొని " పౌరులారా : లెండు మిమ్మిట్లడవుల పాలుగావించిన క్రూరుడగు నీజయచంద్రుని పదములపై నేలబడెదరు. అయ్యో ! మీకునిలువ నీడయైనను నాపురంబున లేకపోయెగా " యని వారినోదార్ప లేచి వారందఱు ఆహా ! నేడు మేమెంతధన్యులమైతిమి ? ఎన్నాళ్లకు భవదీయ దర్శనం బబ్బెను ! రాజచంద్రా : మీకును గహనవాసమే చేకూరెనా? మాగతి యెటులైన గానిమ్ము. అయ్యో : పుట్టుభోగంబులగాంచిన రాజకుమారుడవే: సామ్రాజ్యపాలకుడవే ! ఎట్లీ యరణ్యంబుల వేగించెదవు? హా: దైవమా ! నీ వెంతనిర్దయుడవు ? మాకును మారాజునకును గాననమే గతిచేసితివా " యని విలపించుచుండ " అయ్యా ! నాకురాజ్యము పోయినదనుచింత యెంతమాత్రములేదు కాని యవినీతుడనై వెడలగొట్టిన నామంత్రి పురోహితు లేమైరో యని దుఃఖము గలుగు చున్నది. కట్టా ! నిష్కారణముగ నిండుసభ వారి నవమానపఱచి వెడలగొట్టితి. నా హితము గోరువారిని తలఁపనైతి. క్రూరుఁడగు భట్టునే నమ్మితి. అయ్యో ! ఆ మహాత్ము లిప్పుడు నా కంటబడిన నే నెంతయైన ధన్యాత్ముడ నగుదు " నని చింతించుచు గూరుచున్న తరుణమున మ్లేచ్చ సేవకులు మువ్వురు ముందర కేతెంచి " రాజేంద్రా ! నీ మంత్రి పురోహితు లింతవరకు సౌఖ్యముగ నున్నారు. నీవు వివేక హీనుడవై పారదోలినను వారు నీ సహజగుణము నెఱిఁగి యున్నారు కాన భట్టు మూలమున నట్లు కావించితి వనుకొనుచు మరల నీవు సన్మార్గమునకు రాఁబర

235