ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


జాలక మావలెనే యనేకు లిదివరకే యడవుల పాలైరి. " నగరమందలి గొప్పవారంద ఱొకటియై వానిదగ్గరకేగి " మారాజుగారు లేనితరి మీరిట్లువచ్చి యాక్రమించుకొను టుచితమగునా? కావున న్యాయమాలోచించి మీరువెళ్లు " డన నవ్వుచు నతడు "మీరాజుగారప్పుడే పరలోకగతులైనారు. బ్రతికివచ్చినను నతనికి మేము రాజ్యమియ్యము. చక్రవర్తి నోడినపిదప జయచంద్రుని గూడ జంపి యీరాజ్యము నీశ్వరభట్టున కిచ్చునట్టు అతడు మేము నొప్పందము జేసుకొనుయుంటిమి. కాన మీ దారిని మీరు పొండన వారు మఱలవచ్చిరి. అంత పురవాసు లెల్లరు నెక్కడనైన తలదాచుకొన రాత్రివేళ ననేకమార్గముల బోగడగిరి. మేము నిట్లుచనుదెంచితి" మని వచింప జయచంద్రుడత్యంత లజ్జక్రాంతుడై విచారమున మునిగి " అయ్యా ! మీ కింక నేవిధమైన భయములేదు. మేమును మీవలెనే బాటసారులము, మఱియు మీరునిద్రించుతిరి నే మేల్కొని కావలి యుండెదను. తెల్లవారినపిదప మనమందర మెక్కడికైన బోవుదము, శయనింపు" డన వారు నట్టేపరుండి నిద్దురపోయిరి. జయచంద్రు డారాత్రి నంతయు గావలికాచి ప్రభాతమగు సమయంబున నీవల కేగి కాల్యకరణీయమున దీర్చుకొనివచ్చి కూరుచుండియుండెను. అంత బాగుగ దెల్లవారినపిదప బౌరు లెల్లరు మేల్కొని ఖడ్గపాణియై తమకు గావలిగ గూరుచుండి యున్న రాజుంగాంచి శోకముప్పొంగ హా! జయచంద్రా యని యొక్క పర్యాయముగ నతని పాదములపై వ్రాలిరి. అత్తరి

234