ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


లొట్టపోయి తప్పించుకొనివచ్చి యిటఁజేరినాము. ఇక్కడ జేరిన వెంటనే మరల వీరిదర్శన మయ్యెఁగదా యని భయముకలిగినది. ఇత్తరి నీ వభయహస్తము నిచ్చియున్నావుకాన భయమువదలి మావృత్తాంతము జెప్పెదము వినుము. మేమందరము గన్యాకుబ్జనగరవాసులము. మారాజుగు జయచుద్రుడు సద్గుణవంతుడే కాని యీశ్వరభట్టను నొకదుర్మార్గుని జేరదీసి యతనికుట్రపు మాటలువిని మంచి చెడ్డ ఆలోచింపక చక్రవర్తితో వైరము బెట్టుకొని మా కెన్నరానికష్టముల గలిగించినాడు. రాజ్యకార్య ధురంధరులును, సద్గుణశీలురును మంత్రి పురోహితులునగు వినయశీలదేవశర్మ లెంతజెప్పినను వినక వారల వెడలగొట్టి మారాజు వివేకహీనుఁడై భట్టుసలహా ప్రకారము మ్లేచ్ఛులఁ దోడుచేసుకొని చక్రవర్తిమీదికి దండెత్తిపోయినాడు. నేటికి వారమురోజుల క్రిందట జయచంద్రుఁ డెక్కడికో పారిపోయినాడనియు, చక్రవర్తియు సంయుక్తయు మరణంబు నొందిరనియు దెలిసినది. ప్రజలందరియెడ సమానభావము గలిగి సకలసద్గుణ సమన్వితయై బరగిన సంయుక్త మరణమునకును, నతులిత ప్రతాపశాలియగు చక్రవర్తి గతించుటకును జయచంద్రుడే కారణుఁడుగదా యని పౌరులెల్ల రతని ననేకగతుల దూషింపసాగిరి. ఎటులై నను రాజు కావున నతనిపోకకు నొకవైపు జింతింపసాగిరి. ఇటులుండ వురిసినపుండుమీద కారముజల్లి నట్లు కుతుబుద్దీనును మహమ్మదీయు డొకడు సేనాపరీవృతుడై వచ్చి మా నగరదుర్గమును స్వాధీనము జేసుకొని పౌరులెల్ల ననేకగతుల బాధింపమొదలిడ వానికోర్వ

233