ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కొరగి ప్రాణముల వదలెను. దూరముననుండి చూచుచున్న జయచంద్రు డా దుర్మార్గునకు దగినశిక్ష యైనదని తలంచుకొనుచు సేవకులఁగూడి మరల బయనమై పోపుచుండెను. నాటినుండియు జయచంద్రుని మనసంతయు మారిపోయెను. అంతవరకు దాను కావించిన యవివేకపు గార్యములకు బశ్చాత్తాపమందజొచ్చెను. అన్యాయముగ నీశ్వరభట్టును నమ్మి మోసపోయితిగదా యని తలంపసాగెను. అట్లు పశ్చాత్తాపతప్తుఁడై తన నగరమున కేగుచు మార్గమధ్యమున నొక వృక్షముక్రింద విడసియుండ రాత్రి రెండు ఝాములవేళ గొందఱు బాటసారు లాచెట్టు క్రిందికే వచ్చి మరియొకవైపున విడిసి నిట్టూర్పులు విడచుచు హా ! జయచంద్రా ! మమ్మందఱ నరణ్యములపాలు కావించి పోయితివిగదా యని తన పేరు నుచ్చరించుచు దుఃఖించుచుండ వారి సమాచార మరయుటకై తన మువ్వురు నేవకులతో నెదుటకేగి నిలువ వారు భీతిల్లి యయ్యో ! మనకిక్కడ గూడ మ్లేచ్ఛుల దర్శనమయ్యెనే యని యఱచుచుఁ బరుగిడజొచ్చిరి. కాని జయచంద్రుఁడు వారలనాపి. "అయ్యో ! మీ రెవరు? ఏటికిట్లు మమ్ముగాంచి భయంపడెదరు ? మేము మీ కేవిధమైన యపకారము చేయుటకు రాలేదు. సావకాశముగ మీవృత్తాంతము దెలియఁజేయుఁ" డన " అయ్యా ! నిన్ను గాంచిన మా కేవిధమైన భయము లేదు కాని యీ మువ్వురఁ జూడ మాగుండెలు కొట్టుకొనుచున్నవి. మేమీ దినము సాయంతనము వరకు నిట్టివేషముల వారిచేతులలో జిక్కుబడి చావుదప్పి కన్నులు

232