ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


బన్నుచున్నాడఁ గాని యింతవర కా కోరిక సఫలముగాలేదు. ఇప్పుడు మంచితరుణము దొరికినది. ఈ సమయమును జెడఁ గొట్టుకొంటిమా యిక మనకు వేరొండు తెరుపులేదు. కావున మీ 'రట్లే" యన్నఁజాలు. ఒక్కక్షణమున నేనతనిఁ గడదేర్చెదను. మనము నల్వురము గలిసినటులైన జయచంద్రు రహస్యముగ జంప నవసరముండదు. బహిరంగముగ నెదిరించి పోరాడి చంపవచ్చును. నేనింతకు మునుపు గోరీ మూలమున నా కార్యము నెరవేర్చుకొనఁ దలచియుంటిగాని యతనికే యపజయము కల్గినది. కాన నిప్పుడింత ప్రయత్నము చేయవలసి వచ్చినది. మీ రేమాత్రము భయమందవలసిన కారణములేదు. నేను చిన్నతనంబు నుండియుఁ జేసినవానిఁ జెప్పఁబూనినచో నొకపెద్ద గ్రంథమగును కాన కొంచెముగఁ దెల్పెదను. ఢిల్లీ యందున్న కాలమున నొక మహ్మదీయునితోఁ గలసి చక్రవర్తిపై ననేకములగు గుట్రలబన్నితి, కన్యాకుబ్జముఁ జేరినదాది నితని భరతముఁ బట్టింపఁ బ్రయత్నములఁ జేయుచున్నాడను" అనుమాటలు భట్టునోటివెంట వెడలుటయే తడవుగ నంతవరకును బెరుగుచున్న కోపము నాపుకొని లోపలనున్న జయచంద్రుఁడిక నాపుకొనఁజాలక యౌరా యనుచుఁ దటాలున బొదవెడలి వచ్చెను. భట్టతని గాంచినవెంటనే నిశ్చేష్టితుఁడై యొక్క క్షణ మాత్రము నిలచి తరువాత చప్పున బారిపోవ దలచి కొన్ని యడుగులువైవ చివాలున షైదాఖాన్ బరువెత్తి తనచేతికత్తితో నతని పాదముల తెగగొట్టెను. భట్టు కెవ్వున గేకవైచి నేల

231