ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


అన జయచంద్రుడు వారివాక్యముల విశ్వసింపక “ మీరుచెప్పున దంతయు నాకాశ్చ్యర్యము నున్నది" అనెను. అత్తరి వారు మువ్వురు " రాజా మీ కతనియెడగల చిరపరిచయమున నిట్లనె నెదరుకాని కావలయునన్న నిప్పు డతడువచ్చులోపల నా పొదరింట దాగియుండుడు. మాకందఱకు జరుగుసంభాషణ విందురు గాక" యనిరి. అందుల కతడును సమ్మతించిపోయి పొదరింట దాగియుండెను. అంత గొంతసేపటికి భట్టు చనుదెంచి జయచంద్రుఁ డెక్కడనని యడుగ నవతలకు వెళ్ళిరని వారు చెప్పిరి. అత్తరి మరల " నే నిన్న మీతో ముచ్చటించినదానిఁ గూర్చి యేమీచేసితి ” రన నా మువ్వురు " అయ్యా : రాజ్యము వచ్చునన్న సంతోషము మాకును గలదుకాని మమ్ము బోషించు వారియెడ నట్టిద్రోహంబుఁ గావింప. మా మనంబులు జంకుచున్నవి. మఱియు నా విషయమై తలఁచుకొన్నపుడెల్ల మితిలేని భయము గలుగుచున్న "దని వచించిరి. అందుల కతడు "మీరు వట్టి తెలివితక్కువ వారుగ గన్పించుచున్నారు. మనల బోషించువారని యభిమానము పెట్టుకున్న చో మన మొక్క నాటికి నెగ్గజాలము. అయినంతవరకు మనకు సౌఖ్యము కలుగు మార్గము సూచుకొనవలయుఁగాని రాజని తలచి యూరకున్నచో మన మేనాటికి బాగుపడజాలము. నేను మొదటినుండి యింతవరకు గావించుచున్న వాని విన్నచో మీ రెంతైన నాశ్చర్య పడుదురు. నాకు బుద్దివచ్చినప్పటినుండి రాజ్యము సంపాదింప వలెనన్న కోరికను మనస్సున బెట్టుకొని సాధ్యమైనన్ని కుట్రల

230