ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


దుర్దశం బడియుండఁ, దెల్లవారినపిదప శత్రువుల కంటబడక మిగిలిన కొందఱు చిన్నచిన్న కాలువలుగట్టి పారుచున్న రక్తమునందడిసి లేచి సంభ్రాంతమనస్కులై మహమ్మదీయులు గావించిన మోసమని తెలిసికొని యీవార్త నెఱుగింప వారును డిల్లీకేగిరి. సుల్తాన్‌కుగాని మఱి యితరులకుగాని తెలియకుండఁ బారిపోయిన జయచంద్రుఁడు తనరాజధానికేగ బయనమై పోవుచుండెను. మార్గమధ్యమున నీశ్వరభట్టుకుఁ గలిగిన దురూహలకు మితిలేదు. కన్యాకుబ్జముఁ జేరులోపల జయచంద్రుని జంపి తానుపోయి యారాజ్యము నాక్రమించు కొనఁగోరి పార్శ్వ వర్తులు మువ్వు రత్యంత జాగరూకులై యుంటచే యనేక పర్యాయము లతనిజంపఁ గడఁగియు మానుచు నిఁక వారి కెరుక లేకుండ తనకార్యము నెరవేర్చుకొనుట దుర్ఘటమని తలఁచి యొకనాఁడు రాజావలకు జనియుండ వారితో రహస్యముగ "మిత్రులారా ! మీరు నా కత్యంత స్నేహితులగుటచే నిప్పుడు నేనొకరహస్యముఁ జెప్పుచున్నాను. దుర్ఘటమని యెంచకుడు. పాపమని తలపోయకుఁడు. మన మీ రాజుగారి నెన్నిదినముల నుండియా కొలుచుచున్నాముగదా ! మన కేమైన సౌఖ్య మనిపించుచున్నదా ? ఇత్తరి నేనొకయుపాయముఁ జెప్పెదను. నలుగురముచేరి యీరాజుం గడతేర్చితిమా నిక్కముగ మనకుఁ గన్యాకుబ్జరాజ్యము లభించును. పట్టణముఁ జేరినపిదప నక్కడి విషయములు చక్కబఱుచుభారము నాది. ఇట్లుచేయుటవలన మనకీకష్టములన్నియు నడిగి రాజభోగములు ప్రాప్తములు

228