ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


వారి నేల చంపవలయునని యూహించి వారి మ్లేచ్ఛదేశము వరకు దఱుమఁ దనవారల కాజ్ఞయిచ్చెను. ఇట్లు మ్లేచ్చులు ముందు నార్యులు వెన్కయై రెండుసేనలు మరల ధానేశ్వరము దగ్గరకుఁ జేరెను. సుల్తాన్ తన కపజయము కలిగినందున ననారతము చక్రవర్తి నెట్లు చంపుదునా యని యుపాయముల వెదకుచున్నవాఁడు గాన దుట్టతుదకు మోసముఁజేసి యార్యుల బరిమార్చఁగోరి ధానేశ్వరము చేరినపిదపఁ దా నార్యావర్తము వదలి మార్గమునం దేవిధమైన యల్లరులు చేయకుండ నాఫ్‌గన్ స్థానమున కేగునట్లును, తనదేశము జేరువరకు గొంత చక్రవర్తి సేనను వెంటనుంచుకొని దానికగు ఖర్చులు తానే భరించునట్లును యిక ముందెన్నటికిఁ జక్రవర్తి యనుమతిలేక యార్యావర్తమునకు రాకుండునట్లును, సార్వభౌమునితో సంధిగావించుకొనెను. అట్లు సంధిజేసుకొనుటవలన జక్రవర్తి హృదయమునగల రోష మంతరింప మరలదుఃఖమంకురింపసాగెను. సంధిగావించుకొన్న పిదప మ్లేచ్ఛు లెట్లుండిరో చూచిరండని చక్రవర్తి మొదలగువారు కొందఱు వేగులవారినంప వారు తిరిగివచ్చి మహమ్మదీయులు శస్త్రాస్త్రముల నుజ్జగించి నెమ్మదిగ నున్నారని వచించిరి. అంత నా దినము ప్రొద్దుగ్రుంకిన వెంటనే హాయిగ భుజించి సార్వభౌమసైనికులెల్లరు సకలలోకానందకరముగఁ గాయుచున్న నిండువెన్నెలలో కొంతసేపటివరకు నిష్టమువచ్చిన ప్రసంగము లాడుకొని తరువాత నెక్కడి వారక్కడ నిదురించిరి, చక్రవర్తియుఁ బ్రత్యేకముగఁ దనకొరకు నిర్మిఁపబడిన

226