ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము

ట్లు చక్రవర్తి రణమునకు దిగి రోషభీషణాకారుండై శత్రు సంహారము గావింప మొదలిడ నొకవార మగునప్పటికి జయచంద్రునిసేన పూర్తిగ నాశనమయ్యెను. అనేక వేల మ్లేచ్చులును హతులైరి. అంత నిక నాలస్యమొనరించిన మోసమగునని సుల్తాన్ తన సైన్యమును వెనుకకు మరలించెను. సుల్తాన్ యాజ్ఞప్రకారము సేనలు బరుగెత్తిపోవుచుండ స్వసైన్యములేమి ముందుఁబోయిన యెటువచ్చునో యని జయచంద్రుఁ డొక రాత్రివేళ నెవరికి దెలియకుండ నీశ్వరభట్టును వెంటఁగొని వెండియు యుద్ధమారంభమైనది మొదలు దనకు దార్శ్వవర్తులుగ నుండి మిక్కిలి నమ్మకముతో మెలఁగుచు వచ్చిన జలీమ్‌నేర్, షైదాఖాన్, మిర్జాఖాన్ అను మువ్వురు సేవకులఁ గూడ గైకొని వేరొండు మార్గమున వెడలిపోయెను. చక్రవర్తి పరువెత్తుచున్న

225