ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియవ ఒరజరణము


గొని కనుల కద్దుకొనుచు. "హా ! మదీయకులకమలినీ రాజ హంసినీ ! నీ కింతటిలోనే నూరేండ్లు నిండెనా? నన్నిట్టి దుఃఖ భాజనుగఁజేసి నీ వెచటికేగితివి? తన్వీ! నీ సుందరవదనార విందము గాంచి సంతసించు భాగ్యము నాకు నేఁటితోఁ దీరి పోయెనా? నీవులేని యీ రాజ్యభోగంబులు నాకేల? కట్టా! నీ వంటి యుత్తమకులాంగనల కెల్ల సంపూర్ణాయువు నొసంగవి యా విధాత నేమననగును. ముద్దులొలుకఁబలుకు నీవచనామృత పూరంబులఁ గ్రోలుభాగ్య మే నిర్భాగ్యుండ నగుట దప్పిపోయె. తరుణీ ! ముందుజన్మింపగల నీ తోడికాంతలకెల్ల గురుభూత వైతివి. పుట్టినింటికి మెట్టినింటికి యశంబు దెచ్చితివి. నీకు మాతృదేశముపై గల యభిమానమును వెల్లడిపఱచుకొంటివి. అయ్యో ! భుజముదగ్గరనుండి మెడవరకు తెగినంత మాత్రముననే ప్రాణంబుల నిలుపుకొనఁజాలక పరలోకమున కేగితివికదా? అర్ధాంగివగు నీవు పోయినపిదప నర్దశరీరుఁడనై నే నెట్లు మని యుండగలను? నేనును నీవెంటనే చనుదెంచెద" నని ఖడ్గమునకై వెతకికొనబోవఁ దటాలున విజ్ఞానశీలుండు లేచి యతని హస్తమును బట్టుగొని " రాజేంద్రా | కాలముతీరుటచే నా సాద్వి పోయినది. ధీవిశారధుఁడవగు నీవే యిట్లు సేయబూనిన నీ రణ సంరంభ మంతయు నేటికి ? నీవిట్లు చేయుచున్నావని తెలిసిన జయచంద్రుఁ డాదిగాఁగలవారల కెంత చుల్కన యగునో తలపోయుము. నీవు పోయినపిదప మేముమాత్ర మెందుకు? మున్ముందు మమ్ముఁగడదేర్చి యావల నీ యిష్టమువచ్చినట్లు

223