ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


గురితప్పి భుజముపైన దగిలి మెడవరకు దిగినది. వెంటనే మహాబుద్ది మొదలగు వార లేతెంచి నన్నీ రాజవైద్యశాల కనువ బాప మీ వైద్యుడును సంపూర్ణాదరమున నాకు దగిన చికిత్సలఁ జేయుచున్నాఁడు గాని నే బ్రతుకుటకుమాత్రము దుర్ఘటము. రక్తనాళములన్నియు భిన్న భిన్నము లైనవి. శరీరమునంగల రక్తమంతయుఁ బోయినది. నాధా ! నిర్భాగ్యురాలనగుట నాకు భవదీయ దర్శనంబు మరల గలుగుభాగ్యము లేకపోయే. నా యనంతరమునకు మీరు బెంగపెట్టుకొనక ధైర్య మూని మీ కార్యముల నప్రమత్తులరై యొనర్చుకొనఁ బ్రార్ధించు చున్న దానను.

ఇట్లు విన్నవించుకొను మీ ప్రియురాలు

"సంయుక్త"

అని చదివినతోడనే కనుల వెంట నొక్కుమ్మడి బాష్పములుఁ బాల్గొన మూర్చిల్లి లేచి "హా పరిహసితపూర్ణిమా శశాంకవదనా? హా ! రణరంగసంచరణకళా విశారదా ! హా! వినీలకుంత లాచ్చాదితార్దేందునిటలా ! హా ! తోరూవంశ కల శార్ణవ లక్ష్మీ : హా ! మదీయ మనోమోదసంధాయినీ! హా ! ప్రియసఖీ ! హా ! సంయుక్తా !" యని విలపించుచు మరల మూర్ఛిల్లెను , దగ్గరనున్న వారు శోకపరీతచిత్తులై యావల నట్లు దారుణమగు రణమగుచుండ నిక్కడ నిట్లగుటకు వెతనందుచు ననేకగతుల నోదార్ప లేచి చక్రవర్తి తన కాంతవ్రాసిన లేఖం

222