ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియవ ప్రకరణము


నిక్కముగ నా ప్రాణకాంత కేమైనదో వచింపుడు. నా మనస్సు నేల విట్లు కలత బెట్టెదరు; వచింపు" డన నొక్కడును మాటలాడక విలపింప సాగిరి. అంత నతడు ధైర్యముచెడి “హా ! ప్రాణనాయకీ " యని మూర్చిల్లెను. వెంటనే దగ్గఱ నున్న వారు సేదదేర్స లేచి దుఃఖపరీత చిత్తుఁడై “హా ! నా మోహంపు మొలక, నా ప్రియభామిని, నాప్రాణము, నాసంయుక్త యెక్కడ నని యడుగ మీ రేల ప్రత్యుత్తర మీయరు? నా హృదయమున నేటికిట్లు వ్యధగలుగ జేసెదరు. చెప్పు" డన మహాబుద్ది ధైర్యము దెచ్చుకొని సంయుక్త వ్రాసియిచ్చిన లేఖ నతనిచేతి కొసఁగెను. చక్రవర్తియు లేఖ నందుకొని చదువుకొన నోపక చెంతనున్న మఱియొకని చేతికియ్య నతడిట్లు చదువ నారంభించెను.

ప్రాణేశ్వరా !

తమచరణదాసినగు నే కాలంబుతీరి పరలోకమున కేగుచు విన్నవించుకొను దీనాలాపంబుల కొంచె మాలింపుడు. మీచే నట్లనుజ్ఞాతనై నైజియాపురము జేరిరాజకులుని నోడించి పారఁదోల నతఁడుపోయి వంగపతితో జేరుకొనెను. వెంటనే నేనును మహాబుద్ధికి దోడ్పడ నేగితి. రణమున బ్రవేశించిన దాది మందూరు వంగపతులు నన్నుజంప నెన్నియుపాయములో సల్పిరి కాని వారికి సాధ్యము కాలేదు. తుదకు నే వంగపతిం జంపి యుద్ధము సేయుచుండ రాజకులుఁడు మహాబుద్ధి వేషమున జనుదెంచి నన్ను బొడిచినాడు. తోడనే వానిజంపితి కాని యతని వ్రేటు

221