ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియవ ప్రకరణము


గల్గితిరేవి నా సంగతినంతయు విన్నవించి నా నమ్కృతు లందఁజేయుఁడు. " మీ రూరడిల్లి యుండుఁడన" నెల్లరును భరింపనోప కత్యంతముగ విలపింపసాగిరి. ఆత్తరి మరల సంయుక్త " అయ్యా ! ఈప్రాణి కెప్పటికైన నిర్యాణ మున్నదేగదా ? ఇందులకై మీరింతగ వగవనేటికి ? అనవరతంబు సన్మార్గ వర్తనులై, సత్యవంతులై , స్వార్ధపరత్యాగులై మిమ్ముఁ బాలించు వారియెడల భక్తిగలిగి మెలఁగు చుండుఁడు. అందువలన మీ కెనలేనిసౌఖ్యంబులు చేకూరు" నని వెండియు “మీలో నెవరైన నా జనకునిదగ్గరకేగి యిట్లు వచిఁపుఁడు. "తండ్రీ! నీ వింత యవివేకుఁడవై కావింపఁగడగిన యకార్యముల మూలమునఁగదా నా కట్టిదురవస్థ వాటిల్లినది. ఇందులకు నీపై నా కావంతైనఁ గోపములేదు. నేమరణించిన పిమ్మటనైన యించుక మంచిచెడ్డల విచారించుకొని సన్మార్గమున, నడువుము. పరలోకంబున కేగుచు నీ ప్రియతనూజ సంయుక్త సమర్పించు వందనముల, ననుగ్రహింపు" మని పల్కెను. అంత కొంత తడవునకు మఱింత యాయాసము గలుగసాగెను. మాటలాడ దలంపు గలిగియు శక్తిలేమి కనులు మూసుకొని పరుండి యుండెను. దాసీలు మున్నగువారు దగ్గరఁజేరి పిలువఁ గనులు విచ్చి చూడసాగెను. కొంతసేపటి కదియు నడంగిపోయెను. దండనాయకులు, దాసీలు, వైద్యులు మొదలగువారు చుట్టుఁజేరి విలపించుచుండఁ గొంతవడికి నా ధీరసాధ్వి తన ప్రాణముల వదలెను. అతులిత ధైర్యసాహస పరాక్రమవంతురాలై, యొక్క

219