ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము


నిద్రాభిరతుడై యున్న బాటసారింగాంచి యతని చుట్టుఁజేరి నాల్గు తన్నులతోలేపి కూరుచుండబెట్టి “నీ వెవడ " వని యడుగ నతడింతమంది నడుమ నొంటిఁ జిక్కితిగదాయని యేమియు దోచక మాట్లాడక యూరకుండెను. అప్పుడు వారందఱలో బెద్దయగు బురోహితుడు ముందుకేతెంచి "వీ డతిదుర్మార్గుడు. మన రహస్యంబుల బరీక్షింప నిచటికి వచ్చియున్నాడు. వీని నిపుడు కాళికి సమర్పింపవలయు" ననెను. అందుమీద నలుగురు వానిని విఱిచికట్టి తమతో గూడ ప్రదక్షిణము సేయించుకొనివచ్చి దేవియెదుట నిలువబెట్టి తమ విధ్యుక్త క్రియల నొనరింప మొరలిడిరి. విగ్రహమున కెదుట బదిమండలములు రచించి వాని యందు దాము వెంటగొని తెచ్చిన మద్యబాండముల నుంచి గొరియెల ఖండింప నారంభించిరి. ప్రాణి హింసయనిన గంపమందు నా పాంథుడా దారుణకృత్యములను జూడజాలక మూర్చనొందిపడిపోయెను, తోడనే కొందరాతని మొగముపై జన్నీళ్లు పోసి మూర్ఛ దేర్చుచుండిరి. తక్కినవారు దెచ్చిన జంతువుల నన్నింటి దెగటార్చి వాటి కళేబరముల భాండముల ప్రక్క నుంచి యీ క్రింది మంత్రముల నుచ్చరించుచు బూజ నేయ గడగిరి.

"బ్రహ్మశాపం విమోచథా "

అనగా ఓ మద్యమా ! నీవు బ్రహ్మ మొదలగు వారి శాపముల నుండి కూడ రహితమవై యున్నావు. మరియు--

23