ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సం యుక్త


నే రణమున కేతెంచుచుండ నా మనోహరుడు నన్ను గౌగిలించుకొని 'సతీ! సంగరతలంబున గడు నప్రమత్తురాలనై సంచరింపు' మని వచించెను. నా యజాగ్రత్తచే నిటులయ్యెనని తలఁచునేమో? విధివశంబున నిట్టిపాటుకలిగినదని నుడువుడు. మఱియు నాతోడునీడయగు మంజరికడకేగి నా వచనములుగా నిట్లని తెలియఁజేప్పుడు ' చెలీ ! మంజరీ : చిన్న నాటినుండియు మనమిద్దఱ మొకటిగఁ బెరిగి కలసి యుంటిమి. నేఁడు నీవు నాకుదూరస్థు రాలవై యుంటచే నాకుగల్గినపరితాప మింతింతని వచింప నలవిగాదు. నీవు నా చావునకై బెంగపెట్టుకొనక చక్రవర్తివచ్చు వరకు నగరము నతిజాగరూకత గాపాడి యతని మన్నన లందుము. ఒకవేళ నా నాధునకే యపజయము గలిగినచో మ్లేచ్చుల వాతఁబడకుండ పురకాంతల నందర రక్షించుభారము నీదేసుమా ' అనివెండియు ' సేనాని ! ఇంకొకటిగలదు. ఎవని మూలమున నా యజ్ఞాంధకారము మాసిపోయి జ్ఞానసూర్యుఁడు వెలుఁగఁగల్గెనో - యెవని కారణమున నా మదింగల పిరికితనముపోయి శౌర్య మంకురించెనో యెవవివల్ల నస్త్రశస్త్రాద్య నే కాయుధప్రయోగముల గుర్తెఱిఁగి సంగర రంగమందు సంచరింపదగుదాన నైతినో యెవనిమూలమున నీ మనోరధము లెల్ల నెరవేర్చు కొనుచుందునో ' యెవని యుపాయమున నీశ్వరభట్టు మొదలగువారి మాయా వాగురలఁజిక్కి ప్రాణములఁ గోల్పోవక బ్రతికితినో యట్టి సుగుణగణ సమేతుఁడు, దీనదయాపరుఁడు, పరోపకార పారీణుండగు నా ప్రియోపధ్యాయు దేవశర్మంగాంచఁ

218