ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియవ ప్రకరణము


రక్తనాళములన్నియుఁ దెగియుంటచే శరీరమునం గల నెత్తురంతయుఁ బోయి యతిశీతలత్వమంది యుంటచే ధీవిశారదుఁడగు వైద్యుఁ డత్యుష్ణముఁ బుట్టించు నౌషధముల వాడుచు తెగిన నాళముల దగ్గరజేర్చి రక్తము బయటరాకుండ బ్రయత్నములఁ జేయుచుండెఁగాని గాయ మతని కలవిగాకుండెను. సంయుక్త యప్పటి యవస్థంగాంచి సేనాను లిరువురును దైర్య హీనులై దుఃఖింపమొదలిడ నామె కొంచెము స్మృతికల్గి చెంతనున్న వారిగుర్తించి మిక్కుటమగు నాయాసమున హీనస్వరముతో " సేనాపతులారా ! మీ రిట్లువిలపించిన ప్రయోజనంబేమైనఁగలదా? నాకు గాలమాసన్నమైనది గానఁ బోవుచున్నాను. మరణమునొందుట నాకేమియుఁ జింతలేదు కాని కడసారి నా మనోహరు వదనారవిందముగాంచు భాగ్యము లేకపోయెగదా యనువిచారము నన్ను బాధించుచున్నది " అని యొకలేఖవ్రాసి మహాబుద్దిచేతి కొసఁగి " అయ్యా! నా మరణాంతరము దీని నాప్రియున కందఁజేయుము. నేఁడు నా ప్రాణములు నిలుచునట్లు లేదు. అత్యంతమగు నాయాసము పొడుముచున్నది. కన్నులు దృష్టివిహీనము లగుచున్నవి. మీరు వచించువాక్యములును దిన్నగ వినరావు. మీ రందరు నాకొఱకై చింతింపకుఁడు. నే పోయినపిదప నీ లేఖ నా ప్రియునకొసగి యందుల కతడేమైన నకార్యములు గడంగసమకట్టినచో నాటంకపరచి యోర్పుఁడు. అతని చరణారవిందములకు నా లింగన పూర్వకమగు వేనవేలు నమస్కారము లొనర్చితి నని విన్నవింపుడు. వెండియు

217