ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


దాను గావించు పనియందే మునింగియుండెఁ గాని యతని విషయమై జాగ్రత్త పడదయ్యెను. అట్టి తరుణమున మెల్లన రాజకులుండు వెనుకప్రక్కగ నామెను సమీపించి దీర్ఘ మగు కరవాలముంగొని కంఠమునకు గురిఁజూచి కొట్టెను. వెంటనే యామె భయంకరలీల సింహనాదము జేయుచు దుపాకిదెబ్బ తగుల దెబ్బవెంటనే యెగిరి వేటకానిపైఁబడు సింగములీల రాజకులునిపైబడి నొక్కనిమిషమున నతని పొడిచిచంపెను. కాని వెంటనే యామెయు దన గుఱ్ఱముపై వ్రాలెను. రాజకులుడు విసరిన దెబ్బ కంఠమునకుదప్పి భుజముకడదగిలి మెడవరకును దిగెను. నెత్తురు వెల్లువయై పారుచుండెను. సైనికులెల్లరు తమ రాణికి సంభవించిన పాటునకుఁ దత్తరమందుచు నామెచుట్టుఁ జేరి శత్రువుల దరిఁజేరకుండ దూరము చేయుచుండిరి. ఆవలి వైపున యుద్దముసేయుచున్న యుపసేనాను లిరువు రీవార్త విన్నవెంటనే యొక్కపరుగున సంయుక్త దగ్గర కేతెంచి మాగుబారిన చంద్రునివలె గుఱ్ఱముపై బడియున్న యామెఁగాంచి ప్రబలార్తిమగ్నులై యా క్షణమందే యచటి కొకమైలు దూరముననున్న రాజవైద్యశాల కనిచి మితిమీరిన రోషంబున హతశేషులగు జయచంద్రుని సైనికులనెల్ల దునుమాడి పారఁదోలి సంపూర్ణ జయోపేతులై వారును వైద్యశాలకడ కేగిరి. వీరు వైద్యశాలఁ జేరునప్పటికి సంయుక్త మరణవేదన ననుభవించు చుండెను. లెక్కలేని దాసీలు చుట్టుఁజేరి యనేకగతుల నుపచారముల సలుపుచుండిరి. భుజముపైనుండి మెడవరకు లోపలగల

216