ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియవ ప్రకరణము


ధైర్యసాహసములతో బోరాడుచుండ వారిధాటి కోరువలేక రాజకులుఁ డా నగరమును ముట్టడించుట మానుకొని పరువెత్తి పోయి జయచంద్రుని దగ్గరకేగుట లజ్జాకరమని వంగపతికిఁ దోడ్పడబోయెను. సంయుక్త కావార్త తెలిసిన వెంటనే యచలు నక్కడనే నిలపి తాను మహాబుద్దికి సహాయపడబోయేను. ఫరుక్నగరముననున్న సార్వభౌమ సేనాధిపతులు లీమెంగాంచిన వెంటనే మన్నించి గొంపోయి యామె రణకౌశలము గని విని యున్నందున సర్వ నేనాధిసత్య మామెకే యొసంగి తా ముప నేనాధిపతులై రణము జేయదొడగిరి. సంయుక్త రణరంగమున బ్రవేశించినదాది మందూరు వంగపతు లామె నెటులైన జంప ననేక ప్రయత్నములు చేయుచుండిరి. ఆమె తన యుపసేనాను లిరువురు వేరొండు దిక్కుల రణముఁ జేయుచుండ రెండుచేతుల రెండుకత్తులఁబూని సేనామధ్యమునకుఱికి లేక్కలేని భటులఁ జంపుచు వంగపతిని సమీపించి యతని గడదేర్చెను. వేరొక ప్రక్క యుద్దముజేయుచున్న రాజకులున కీవార్త తెలిసినవెంటనే భయమంది యెదుటఁబడి పోరాడిన శాత్రవులఁ గెల్వఁజాలమని రహస్యమార్గమున నామెంజంప నిశ్చయించుకొని యువసేనాను లున్న స్థలమును వదలకుండునట్లు యుద్ధము చేయుచుండ వలసినదని తన క్రిందవారల కాజ్ఞాపించి యతడు మహాబుద్ది వేషమూని యామెకడ కేతెంచుచుండెను. సంయుక్తయు నాకలి గొన్న యాడుసింగములీల విజృంభించి రణమునేయుచు దూరమున వచ్చుచున్న రాజకులునిగాంచి మహాబుద్ది యను తలంపున

215