ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


ఎక్కడనో నీచమగుచావు చచ్చుటకన్న శత్రువులతో నెదిరించి పోరాడి మరణంబునొందుటయే మేలు. ఈ తుచ్ఛశరీరంబులపై నావంతైన నభిమానము బెట్టుకొనకుడు. ఇంతకాలము మిమ్ము బోషించినవారి యెడలను, మీ మాతృదేశము నెడలను సంపూర్ణాభిమానము గలిగియుండుడు. పొండు. మీకార్యముల నప్రమత్తులరై యొనర్చుకొను " డన నందఱు రోషావేశులై విజృంభించి రణమునకేగి యొక్కుమ్మడి వైరిసంహారము గావింప నారంభించిరి. అట ఫరుక్నగరమున మహాబుద్దీ తనసేనలఁ జక్కదీర్చి యుద్ధము సేయించుచు వంగపతిని భీతిల్లఁ జేయుచుండెను. కోసలపతి నెదురింపఁబోయిన ఘూర్జరనాయకు డవలీల సంపూర్ణము జయముంగొని మరల శత్రుపులెవరైన నే తెంతురేమో యని కొన్ని దినంబులవరకు జోలాపురియందే యుండి వేగులవారివలన జయచంద్రుడు తన్నగరపు ముట్టడిని మానుకున్నాడని విని తనకడనున్న సేనయందు కొంతభాగము నట కావలిగనుంచి మిగతదానిం గూడుకొని మహాబుద్ధికి దోడ్పడ నేతెంచెను. ఇట్లార్యావర్తమునఁ బ్రఖ్యాతి గాంచిన వానిలోనివగు దుర్గములు రణసంకులములై యుండ నాలుగైదు వారములు గడచిపోయేను. అప్పటి కలీఘరు దగ్గరనున్న జయచంద్రువి సేన విస్తారభాగము నాశనమయ్యెను. లక్షలకొలదిగ నున్న తమ సేనయంతయు నష్టమగుచున్నందులకు సుల్తాన్ జయచంద్రు లిరువురు నిరుత్సాహులై విచారపడసాగిరి. అట గైజియా పురమందలి సైనికులు బాహుపరాక్రమము లుల్లసిల్ల

214