ఈ పుట ఆమోదించబడ్డది

రా ణీ సంయుక్త


బ్రోత్సాహ పఱచుచున్న సంయుక్తకా వార్త తెలిసి వెంటనే భర్తకడకేతెంచి " నాథా! మీరేటికిట్లు యోచించెదరు. అచలునికి దోడ్పడఁబోవుట కేనుసిద్ధముగ నున్నదానను. నన్నుఁబంపుటకు మీ రెంతమాత్రము సందేహింపఁబనిలేదు. వేవేగ సెలవొసఁగు డని " వెనుదీయక పలుకుచున్న తన ప్రాణప్రియను వదల నిష్టము లేనివాఁడయ్యు నేమియు సేయఁజాలక యటుపొమ్మని సమ్మతించెను. అంత నామె కొంత సైన్యమును బ్రయాణమునకు సిద్ధపఱచి బయలు వెడలిపోవుటకుముందు చక్రవర్తికడ కేతెంచి యతని గాఢాలింగన మొనర్చుకొని " ప్రాణనాథా ! యుద్ధమున జయాపజయంబులు దైవాధీనములుగదా? నాకచట నొకవేళ నేదైన నపాయము సంభవించినచో మీరు ధైర్యము వదలక మీ కార్యముల ప్రమత్తులరై యొసరించుకొన బ్రార్థించుచున్నదాన " నన నతఁ డత్యంతవిచారమున "సతీ ! నిన్నొంటరిగఁబంప మనసొప్పకున్నను విధిలేక పంపుచున్నాను. జాగ్రత్తతోడ రణభూమిని సంచరింపుము. మరల మనమిరువురము గలిసికొను భాగ్యమున్న నెట్లును గలసికొనఁగలము. పోయిరమ్మని " బిగియార గౌగిలించుకొని దీవించిపంప నామెయు నతనికి బ్రణమిల్లి లేచి బయలు దేరి నేనంతయు నతినిపుణముగ సడిపించుకొని గైజియాపురమున కేగుచుండెను.

212