ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదితో మ్మీదవ ప్రకరణము


కుబ్జరాజ్యమును ధ్వంసముజేయ నీ వెక్కడినుండి దాపరించితివి? దుర్మార్గుడా ! నీవు నా తండ్రి వేటికైతివి ? లేకున్న నీవంటి నీచుని నీనా ఖడ్గమున నొక్క వ్రేటున నేల కర్పించియుందునే. నీ వొక్కరుఁడవే యిట్టి యకార్యముల సలుపుటగాక తక్కుంగల సామంతులఁ గూడ పురికొల్పి దెచ్చితివా? ఆహా! ఆర్యావర్తమునంగల యైకమత్యము నంతయు ధ్వంసముగావించి విడచితిగదా? చీ ! ఇఁక నీ ముఖము 'వీక్షించిన బాతకమగు" నని యగ్గలంపురోషమున నా చోటువదలి పోయెను. జయచంద్రుడును నిరాఘాటముగ నెదురించిపల్కు పుత్రిక యెదుట నోరుమెదల్పనోడి వెడలిపోయిన వెంటనే తన శిబిరమున కేతెంచి సుల్తాన్‌వలన జక్రవర్తి వచ్చినాడన్న వార్తవిని తన సేనా నాయకులకు రణముగావింప నుత్తరువొసంగెను. మరియు నత్తరిఁ గొందరు చారులరుదెంచి కోసలపతియోడి పారిపోయినాఁ డనియు, మందూరు వంగపతులు మఱికొంతసేన సంపవలసిన దని కోరినారని వచింప నట్లే వారికడకు మరికొంతసేననంపెను. అలీఘరువద్ద నిరువాగులవారును హోరాహోరిగఁ బోరాడఁ గడఁగిరి. ప్రాణముల కాశింపక తమతమ నాయకులచే హెచ్చరింపబడు దినముల కొలది సంగర మొనరించుచుండిరి. ఇటు లిక్కడ ఘోరమగు రణము జరుగుచుండ మఱికొంతసేన నంపవలసినదవి యచలునికడనుండి చక్రవర్తికి లేఖవచ్చెను. సేనానాయకులందఱు రణమున మునిగియుండ నెవనిబంపుదునా యని చక్రవర్తి యోచించుచుండ వేరొకవైపున సైనికులఁ

211