ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


జయముకలిగెనా నీ వేకోండలకైనఁ బారిపోవలసినదే గాని యిక్కడనుందువనుట కల్ల. నీవు నాయెడల నింతకాఠిన్యము వహించియున్నను నిన్నుగాంచిన నా కపరిమితమగు జాలికలుగు చున్నది. కట్టా ! ఈనీచులు నిన్నెట్టి బాధల బెట్టుదురోగదా? నీకీ యజ్ఞాన మెక్కడ కలిగినది? చిన్నదాననైనను తండ్రి వగుటచే నీ మేలుగోరి యింతగ వచించుచున్నదానను. మరియు మన తాతలనాటినుండి వచ్చుచున్న నుత్తములగు వినయశీల దేవశర్మల వెడలగొట్టించితివని వినుటకు నా కెంతయో సంతాపకరముగ నున్నది. ఇంతవరకైనది కానిమ్ము. ఇప్పుడైన దెలివి కలిగి జాగ్రత్తపడుటకు దగినంత సనుయమున్నది." అని వినయ వినమితోత్తమాంగయై పలుకుచున్న కూతుం గాంచి పట్టరాని కోసమున . " ఓసీ దౌర్భాగ్యురాలా ! నీకీ యధిక ప్రసంగ మేటికి ? నీవీ తత్క్షణమున నా యెదుటనుండి లేనిపోయెదవా లేదా" యని యతడు హుంకరించి పల్కిన నింతగ వేడుకొన్నను గార్యము లేకపోయెనని యామె యత్యుగ్రమునంది " కుత్సితుఁడా : నీవు నా తండ్రివైన నగుదువుకాక. నీవు నా జనకుడు ననుటకెంతయు సిగ్గగుచున్నది. ఏ పాపముననో నీకు బుత్రికనై జన్మించితిగాని వేరొండుకాదు. స్వోదర పరాయణులును, గుమార్గగాములునగు భట్టుమొదలగువారి వాక్యములే యమృతప్రాయములై నీ తలకెక్కెనా ? పవిత్రవంతమగు తోరూవంశపారావారంబున హాలాహలముఁబోలి' జన్మించితివి కదా? తరతరంబులనుండి ప్రఖ్యాతికెక్కి వచ్చుచున్న నీకన్యా

210