ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది దొమ్మిదవ ప్రకరణము


నిదివరకే ప్రబలియున్న వామమార్గులవలన సాధువులగు పశుపు లనేకములు నాశనమై పోవుచున్నవి. ఇఁక వీరును వారికి దోడ్పడినచో నా పశువులకు బ్రతుకుదెరు వెక్కడిదిది! అయ్యో !నీకుగల భూతదయ యంతయు నే గంగలో గలసిపోయినది? తండ్రీ ! ఏ కరణివిచారించినను నార్యావర్తము నంతయు ధ్వంసముకావించినవాఁడ వగుదువుగాని వేరొండుకాదు. ఇప్పటి వారిమాట యటులుండ ముందు జన్మించువారెల్లరు నిన్నాడి పోసుకొనక మానరు. ఇఁకనైన సుల్తాన్ తోఁగల మైత్రి వదలుకొనుము. నీవు నా నాధునకు సహాయమొనరింపకున్న మానె. మ్లేచ్చులకు సహాయము సేయకున్నఁ జాలు. నానమస్కృతులం గైకొని కరుణింపు" మని యభివాదన మొనర్చ నొక్క తన్నుదన్ని " ఓసీ ! కన్నకూతురువని యేమియు సేయక చూచుచు నూరకున్నకొలది నోటికివచ్చినట్లెల్ల వదరసాగితివా ? నీకీ కంఠశోషణ మెందులకు ? నా యిష్టమువచ్చినట్లు కావించెద. నన్నాజ్ఞాపించుటకు నీ వెవతెవు ? నా దృష్టి పథమునుండి తొలగిపొ"మ్మన మరల నామె కడసారి చెప్పిచూచెదంగాకని " నాయనా ! ఏటికిట్టి బెట్టిదంపువాక్యము లా డెదవు ? నే మిమ్ము వేడుకొనుచుంటిగాని యాజ్ఞాపించుచుంటినా? తండ్రీ ! కృతఘ్నులగు నీ మ్లేచ్చులు దమయవసరము తీరినవెనుక నిన్నును నాశనము జేయుదురుగాని మన్నింపఁజూతురా? అయ్యో ! నీవు వీరలకు దోడ్పడుట కాలాహికి బాలుపోసి పెంచుటే. ఈ క్రూరుల దరిజేర్చుట శార్దూలముల దగ్గరజేర్చుటే. వీరలకే నిక్కముగ

209