ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


మంతయు గూరుచుండుటకుఁ గూడ తగనిదిగ నున్నందున మరల గ్రిందికివచ్చుచు గొళ్లెము తగిలింపఁబడియున్న కాళికాలయముఁగాంచి తలుపుఁదెఱచుకొని లోనికేగి పైనఁ దాను చూచినదానికంటె నక్కడ బాగుగ నున్నందున నా రాత్రి నచటనే గడుప నిశ్చయించుకొని గుడి యవతలివైపునకుఁ బోయి యక్కడి వసారాలోఁ బైగుడ్డఁ బఱచుకొని పరుండి నిదుర పోయెను, నాఁటిదినమమవసయగుడుఁ గొంత సేపునకు దిక్కులు దెలియరాక మిట్ట పల్లము లేకములగునట్లు గాఢాంధకారము గ్రమ్ముకొనెను. అర్దరాత్ర మగునప్పటికి నాకటిక చీకటియందుఁ గొందఱు స్త్రీ పురుషులు చేతులయందుఁగాగడాల వెలిగించుకొని వచ్చి కొండనెక్కి కాళికాలయము బ్రవేశింప దొడగిరి. కొందరు మద్యభాండముల మోసుకొని వచ్చుచుండిరి. మఱికొందఱు బలిసిన గొఱ్ఱెలఁ వెంటగొని వచ్చుచుండిరి. వీరందఱు గుడిలో బ్రవేశించు తరిఁ గలిగిన రొదలకు వెనుకవైపుననున్న బాటసారి మేల్కొనిలేచి, యవతలిగుండ బారిబోవ బ్రయత్నించె గాని యా ప్రక్క ద్వారములేక గోడలెత్తుగ నుండెను. అంత నేమైన గావిమ్మని గుండెరాయి జేసికొని మరల నెప్పటి చోటికి వచ్చి నఖశిఖ పర్యంతము ముసుగిడుకొని కదలక పరుండి యుండెను. మతస్థులును గుడికి బ్రదక్షిణ మొనర్పసాగిరి. కాగడాల బట్టుకొని కొందఱు ముందు వెన్కలనడచిరా నోట వచింపరాని బూతుపాటల బాడుచు బ్రదక్షిణము చేయదొడగిరి. అట్లు వారంద రాలయము వెనుకకేగి యట భీతిచే గపట

22